జూనియర్ ఎన్టీఆర్ 33.. తమిళ దర్శకుడితోనే..?


'దేవర' బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' కోసం ముంబైలో షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. జనవరిలో ఎన్టీఆర్ సీన్స్ పూర్తి చేయాలని దర్శకుడు అయాన్ ముఖర్జీ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు. తర్వాతి ప్రాజెక్టులపై కూడా ఎన్టీఆర్ ఫోకస్ పెట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ప్యాన్ ఇండియా మూవీ పూర్తికాకముందే, తన 33వ సినిమా దర్శకుడిని కూడా ఎన్టీఆర్ ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఫిలిం నగర్లో వచ్చిన టాక్ ప్రకారం, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో చేయబోతున్నాడట. ఇప్పటికే వారి మధ్య కథా చర్చలు జరిగి, దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తన స్వంత బ్యానర్ లోనే ఈ సినిమా చేయాలని చూస్తున్నప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇతర ప్రాజెక్ట్‌ల నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వివరాలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో 'జైలర్ 2' పూర్తి చేసిన తర్వాత నెల్సన్ ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తాడని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'వార్ 2' తర్వాత ఉత్తరాదిలో తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో ఫైట్స్, డాన్సుల్లో పోటీగా నిలుస్తూ భారీ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 'దేవర 2' ప్రాజెక్ట్‌పై ఇంకా క్లారిటీ లేకపోయినా, ఈ సినిమా కోసం కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post