సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న పాన్ ఇండియా సినిమా ‘గేమ్ చేంజర్’ మీద మెల్లగా హోప్స్ పెరిగాయి. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మూడు సంవత్సరాలుగా పలు అడ్డంకులు ఎదుర్కొని చివరికి సంక్రాంతి బరిలోకి దిగుతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంక్రాంతి సీజన్ టార్గెట్ చేస్తే కలెక్షన్లలో బలం చూపొచ్చని, ఈ తేదీని ఫిక్స్ చేశారు.
అయితే, ‘గేమ్ చేంజర్’కు పలు సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. తెలుగులో బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’, వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు బరిలో ఉన్నాయి. వీటితో పాటు, తమిళనాట అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా సంక్రాంతి బరిలో దిగుతోంది. తమిళనాడు మార్కెట్‌లో అజిత్ సినిమాతో పోటీ తప్పదని, అక్కడి ప్రేక్షకులు ఎక్కువగా స్థానిక చిత్రాలకే మద్దతు ఇస్తారని టాక్ వినిపిస్తోంది.
కన్నడలో టాక్ ను బట్టి ఆడే అవకాశం ఉంటుంది. మలయాళం అయితే పెద్దగా బజ్ లేదు. ఇక టాక్ అద్బుతంగా ఉంటేనే ‘గేమ్ చేంజర్’ కలెక్షన్లపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. హిందీ బెల్ట్‌లో మాత్రం పెద్దగా పోటీ లేకపోవడం, రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్ పాజిటివ్ పాయింట్ అనిపిస్తోంది. కానీ అక్కడ బజ్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్ పరవాలేదనే టాక్ తెచ్చినా, పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. పొంగల్ సీజన్‌కి ఉన్న క్రేజ్ ఆధారంగా కలెక్షన్లలో పెద్ద విజయం సాధించాలని మేకర్స్ ఆశపడుతున్నారు. మరి సంక్రాంతి బరిలో ‘గేమ్ చేంజర్’ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో, థియేట్రికల్ రన్‌లో గెలుపు సాధిస్తుందో వేచి చూడాలి.
Follow
Follow
Post a Comment