రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం గేమ్ ఛేంజర్ ఎట్టకేలకు 2025 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సామాజిక కథా చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. రామ్ చరణ్ ఇందులో తండ్రీకొడుకుల ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కొడుకు పాత్రలో ఆయన ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నారు.
అయితే సినిమాలో ప్రధానంగా HYDRA తరహాలో ప్రత్యేక ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారనుందట. ఇటీవల హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతే హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక సినిమాలో ప్రభుత్వం చట్టవిరుద్ధ నిర్మాణాలను కూల్చడం పట్ల ఒక అధికారిగా చరణ్ పాత్ర చూపే దృఢత, న్యాయతత్వం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందట.
ఈ ఎపిసోడ్స్ షూట్ గత సంవత్సరమే ఫినిష్ అయ్యింది. ఈ సన్నివేశాలు, తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయాలకు సంబంధం లేకుండా, పూర్తిగా కల్పిత కధనంతోనే తెరకెక్కించినట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. గేమ్ ఛేంజర్లో ఎస్‌జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో మెరవనున్నారు. శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై పని చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
Follow
Follow
Post a Comment