చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ ఈవెంట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్పీచ్ తన అసంతృప్తిని బయటపెట్టింది. ముఖ్యంగా పుష్ప 2 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను వేరొకరికి అప్పగించడం పట్ల దేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని అర్ధమవుతుంది. "ప్రతీ రీల్‌ని ఆస్వాదిస్తూ సంగీతం అందించాను. కానీ నిర్ణయం ఎవరిదైనా సినిమా ఫలితమే తేలుస్తుంది," అని దేవి స్పష్టం చేశారు.
అలాగే మైత్రి నిర్మాత తనపై ప్రేమ కంటే కంప్లైంట్ ఎక్కువ ఇస్తుంటారని అనడం మరొక షాకింగ్ కామెంట్. ఈ వ్యాఖ్యలు పబ్లిక్ స్టేజ్ మీద ఓపెన్‌గా రావడంతో వివాదం మరింత పెద్దదైందని చెప్పాలి. అయితే మైత్రి మూవీ మేకర్స్ వద్ద ప్రస్తుతం దేవి రెండు ప్రాజెక్టులు చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. రెండో ప్రాజెక్ట్ ఆర్‌సి 17, ఇది రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. పుష్ప 2 వివాదం తర్వాత ఈ ప్రాజెక్టుల్లో దేవి కొనసాగుతారా అన్నది ప్రశ్నగా మారింది.
ఇదిలా ఉంటే మైత్రి బ్యానర్ మరికొన్ని చిత్రాలకు అనిరుధ్, జివి ప్రకాష్ వంటి ఇతర సంగీత దర్శకులను తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ తన అసంతృప్తిని ఇలా బహిరంగంగా వ్యక్తం చేయడంతో మైత్రి వారి వైఖరి ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 హిట్ అవుతుందనే ఆశలు ఉన్నప్పటికీ, బిజీఎమ్ బాధ్యతలు అప్పగించిన తమన్, సామ్, అజనీష్‌ల స్కోర్ విజయవంతమైతే దేవి అభిప్రాయానికి బలం తగ్గవచ్చు. అందుకు మరో పది రోజులు వేచి చూడాల్సిందే. కానీ ఈ వివాదం దేవి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Follow
Follow
Post a Comment