అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా పాన్ ఇండియా మాత్రమే కాకుండా గ్లోబల్ స్థాయిలో కూడా భారీ అంచనాలు రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డులను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్లలో ఆర్ఆర్ఆర్ రికార్డులను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు షురూ అయ్యాయి. మేకర్స్ దేశంలోని ప్రధాన పట్టణాల్లో 7 భారీ ఈవెంట్లు ప్లాన్ చేశారు. కానీ, ఈసారికి ప్రమోషన్ కోసం తీసుకున్న స్ట్రాటజీ పూర్తిగా విభిన్నంగా ఉంది. కార్పొరేట్ కంపెనీలతో టైఅప్స్ చేస్తూ, వారి బ్రాండ్లను కూడా పుష్ప 2 హైప్ ద్వారా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఈ టైఅప్స్ ద్వారా కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్లను మాస్ లెవెల్‌లో చేరవేయడానికి పుష్ప 2 క్రేజ్‌ను వాడుకుంటున్నాయి. ఒక్కో కంపెనీ రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ సినిమా ప్రమోషన్స్‌కు రూ.150 కోట్లకు పైగా ఖర్చవుతుందని తెలుస్తోంది. ఇది పూర్తిగా కార్పొరేట్ సంస్థలే భరించబోతున్నాయని టాక్.
ఇప్పటివరకు రియాలిటీ షోలు, టీవీ ప్రోగ్రామ్‌లు, టాక్ షోలకి స్పాన్సర్‌గా వచ్చిన కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు సినిమా ప్రమోషన్‌లోకి అడుగుపెడుతున్నాయి. పుష్ప 2 సక్సెస్‌తో ఈ విధానం భవిష్యత్తులో మరిన్ని సినిమాల మీద ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Post a Comment