వరుణ్ తేజ్: కలెక్షన్స్ కంటే రెమ్యునరేషన్ ఎక్కువ?


మెగా హీరో వరుణ్ తేజ్ కొంతకాలంగా సరైన విజయాలను అందుకోలేకపోతున్నాడు. సోలో హీరోగా చేసిన గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, చివరగా మట్కా వంటి వరుస సినిమాలు భారీగా డిజాస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా మట్కా సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు కనీసం కోటి షేర్ అందుకోలేకపోయింది. ఇక వీకెండ్స్ లో జనాలు లేక కొన్ని ప్రాంతాల్లో షోలు రద్దు కావడం వరుణ్ కెరీర్‌పై పెద్ద దెబ్బ వేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా వరుణ్ తేజ్ తన రెమ్యునరేషన్ విషయంలో తగ్గడం లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు ఫుల్ రన్ లో కూడా 5 కోట్లు అందుకోలేకపోయాయి. అయినప్పటికీ ప్రస్తుతం అతను ఒక్క సినిమాకు రూ. 7 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా ఫ్లాప్స్ వచ్చినా కూడా, తన మార్కెట్‌పై నమ్మకంతో వరుణ్ ముందుకు సాగుతున్నాడు.

త్వరలో వరుణ్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాడు. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం కొరియా బ్యాక్ డ్రాప్ లో రానుంది. కొరియా కనకరాజు అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. ఇక మరోవైపు, మైత్రి మూవీ మేకర్స్‌తో విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఒక కొత్త తరహా లవ్ స్టోరీ కూడా చేయబోతున్నాడు.

Post a Comment

Previous Post Next Post