ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ ప్యాన్ ఇండియా చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప 2: ది రూల్’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇది వర్క్ స్టైల్ పరంగా సరైనదేమీ కాదని తమన్ స్వయంగా అన్నారంటే, దీనిపై మరింత ఆసక్తి నెలకొంది.
తమన్ తాజా ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందిస్తూ, “సినిమా ఆరంభంలోని మూడు రీల్స్‌కి మాత్రమే నేను మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఈ పని చేయడం నా నిర్ణయం కాదు, నా బాధ్యత. అల్లు అర్జున్, సుకుమార్ నాపై నమ్మకం ఉంచారు. ఈ పని కరెక్ట్ కాదని నాకు తెలుసు. అయితే బన్నీ పిలిచినప్పుడు రిజెక్ట్ చేయలేను,” అన్నారు.
తమన్ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేయడంపై మాట్లాడుతూ, “మేం ఇద్దరం మణిశర్మ గారి శిష్యులు. పుష్ప 2 కోసం సహజంగా కోఆర్డినేట్ అయ్యాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం మా ఇద్దరి ఐడియాలు కలిపి పనిచేశాం. వర్క్ స్టైల్ అనవసరమైన ఒత్తిడిగా ఉన్నప్పటికీ, చివరికి మంచి అవుట్‌పుట్ అందించడమే మా లక్ష్యం,” అన్నారు.
ఇక ‘పుష్ప 2’ ప్రీరిలీజ్ బిజినెస్ ఊహించని మార్క్ దాటడంతో సినిమా విజయం పట్ల నిర్మాతలు, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి తమన్, దేవి కాంబినేషన్ నుంచి వచ్చిన మ్యూజికల్ అవుట్‌పుట్ థియేటర్లలో ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
Follow
Follow
Post a Comment