‘ఇండియన్ 2’ డిజాస్టర్ నష్టాల గురించి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా శంకర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. చాలా మంది అనవసరంగా ‘ఇండియన్’కు సీక్వెల్ తీసి శంకర్ తన సత్తా కోల్పోయారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ 2 ఆశించిన విజయం అందుకోలేకపోవడంతో ‘ఇండియన్ 3’ పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు మరింత ఎక్కువయ్యాయి.
మూవీ ప్రాజెక్ట్ మొదట ఒకే భాగంగా చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ, బడ్జెట్ భారీగా పెరగడంతో రెండు పార్ట్స్‌గా విడదీయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కథలో సాగే లేని విస్తరణే ఈ ప్రాజెక్ట్‌కు ప్రతికూలమైందనే అభిప్రాయాలు ఉన్నాయి. ముందే ‘ఇండియన్ 3’కు సంబంధించిన కొంత షూట్ పూర్తి చేశారు కొన్ని సీన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలనే ప్రచారం జరిగినా, ఇప్పుడు కోలీవుడ్ నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, ‘ఇండియన్ 3’ను మళ్లీ సెట్స్‌పైకి తీసుకురానున్నారని తెలుస్తోంది.
కమల్ హాసన్ సూచించిన మార్పులను కలుపుకుని మరికొంత భాగాన్ని మళ్లీ చిత్రీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అలా రీ షూట్ చేస్తే లెక్క 100 కోట్లకు పైనే పెరిగే అవకాశం ఉందట. అసలు ఊహించని బడ్జెట్ పెట్టి నష్టపోయిన లైకా ప్రొడక్షన్ మళ్ళీ ఆ రేంజ్ లో బడ్జెట్ పెట్టడానికి ఒప్పుకుంటుందా అనేది అసలు సందేహం. అయితే త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుందని టాక్. కమల్ హాసన్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై ముందుగా ఉత్సాహంగా ఉన్నారు. ‘ఇండియన్ 3’ కథే అసలు స్ఫూర్తి అని గతంలోనే చెప్పిన కమల్, ఈ మార్పులతో ‘ఇండియన్ 2’లో వచ్చిన లోపాలను సరిదిద్దుకుంటే, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమాగా ఉన్నారు.
Follow
Follow
Post a Comment