తెలుగు సినిమా అంటే కథానాయకులు మాత్రమే గుర్తొచ్చే రోజుల నుండి, దర్శకులు ఫోకస్‌లోకి వచ్చే వరకు టాలీవుడ్ ఎన్నో మార్పులను ఎదుర్కొంది. ఈ మార్పుకు పునాది వేసిన రాజమౌళి వంటి దిగ్గజులతో పాటు, ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ వంగా, నాగ్ అశ్విన్, లోకేష్ కనగరాజ్ వంటి వారు భారతీయ సినిమా స్థాయిని పెంచారు. ఇక నేటి కుర్ర దర్శకులు కూడా అదే స్థాయిలో అద్భుతమైన సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రశాంత్ వర్మ పేరు. ‘హనుమాన్’ వంటి సూపర్‌హీరో సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలను పొందారు. అదే విధంగా, చందూ మొండేటి ‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఊర మాస్ స్టైల్ లో రూపొందించిన ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ వర్మ వంటి కొత్త దర్శకులు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను సాధించారు.
తాజాగా ‘OG’ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో భారీ యాక్షన్ చిత్రం తీస్తున్న సుజిత్, ఫ్యామిలీ కథ ‘హాయ్ నాన్న’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శౌర్యువ్, అలాగే ‘లక్కీ భాస్కర్’ తో సక్సెస్ సాధించిన వెంకీ అట్లూరి — ఈ కుర్ర దర్శకులు ప్రతిభ, కొత్త కథలతో తెలుగు సినిమాకు కొత్త బాటను వేస్తున్నారు. దిగ్గజ దర్శకుల వారసులుగా కొత్త దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ భవిష్యత్‌కు బలమైన స్తంభాలుగా మారుతున్నారు. ఒక విధంగా టాలీవుడ్ భవిష్యత్తు మొత్తం వీరిదే అని చెప్పవచ్చు. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యువ దర్శకులలో కొందరు 500 కోట్లు, 1000 కోట్ల ఫిగర్ ను టచ్ చేస్తారని చెప్పవచ్చు.
Follow
Follow
Post a Comment