ఖాన్ రికార్డులపై పుష్ప రాజ్ టార్గెట్


నార్త్ ఇండియాలో భారీ ఈవెంట్స్ నిర్వహించడం ప్రస్తుతం చాలా అరుదుగా మారింది. బాలీవుడ్‌లో ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు ఆ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం తన కొత్త చిత్రం పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించేలా ప్రీ రిలీజ్ ఈవెంట్లను ప్లాన్ చేస్తూ, ఖాన్ లెవెల్ రికార్డులను టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

7 ప్రధాన నగరాల్లో ఈవెంట్లను నిర్వహిస్తున్న పుష్ప టీమ్ భారీ సాహసం చేస్తోంది. ఇక మొదటి రోజు హిందీ బాక్సాఫీస్‌పై పుష్ప 2 ఎంత రాబడుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హిందీ మార్కెట్‌లో గతంలో జవాన్ ఫస్ట్ డే 63.90 కోట్లు, పఠాన్ 55.70 కోట్లు కలెక్షన్స్ అందుకున్నాయి. సౌత్‌లో KGF 2 (52.40 కోట్లు) ముందు ఉండగా, బాహుబలి 40.75 కోట్లతో టాప్ 10లో నిలిచింది.

ఇప్పుడు పుష్ప 2 ఈ రికార్డులను దాటుతుందా అనే ప్రశ్న అటు ట్రేడ్ వర్గాల్లోనూ, ఇటు ఫ్యాన్స్ లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో 1000 కోట్ల టార్గెట్‌తో సినిమాను విడుదల చేస్తోంది. కేవలం హిందీ మార్కెట్‌కే కాదు, పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2 హవా కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ప్రమోషన్ ప్రణాళికలు చూస్తుంటే ఖచ్చితంగా హిందీ మార్కెట్‌ను కదిలించగలగడం ఖాయం. 

Post a Comment

Previous Post Next Post