టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఊరట లభించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ నంద్యాల పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేయాలని ఆదేశించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే, ఎన్నికల సమయంలో షూటింగ్ కారణంగా హైదరాబాద్ నుండి తిరుపతికి వెళుతున్న అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చినప్పుడు, వైసీపీ తరఫున పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవి ఇంటికి వెళ్లారు. బన్నీని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడ చేరుకోవడంతో రవితో పాటు బన్నీపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదైంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమాలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అల్లు అర్జున్, సెక్షన్ 144 అమల్లో ఉన్నప్పుడు అనుమతి లేకుండా జన సమీకరణ నిర్వహించారని నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలన్న కోరికతో అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు, తుది తీర్పును ప్రకటిస్తూ కేసు కొట్టివేయాలని ఆదేశించింది.
Follow
Post a Comment