వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన మట్కా చిత్రం ఈనెల 14న విడుదల కాబోతోంది. లేటెస్ట్ ట్రైలర్ ఆకట్టుకుంటుండగా, ఈ కథకు 1960ల వైజాగ్ నేపథ్యంలో స్ఫూర్తిగా రతన్ ఖత్రీ జీవితం నిలిచిందని దర్శకుడు కరుణ కుమార్ వెల్లడించారు. మరి రతన్ ఖత్రీ అంటే ఎవరు? అనే వివరాల్లోకి వెళితే.. గ్యాంబ్లింగ్ ప్రపంచంలో రతన్ ఖత్రీ పేరు మట్కా కింగ్‌గా ప్రసిద్ధి చెందింది. పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించిన ఖత్రీ, దేశ విభజన అనంతరం భారతదేశం వచ్చి, 1962లో ముంబైలో తన మట్కా గ్యాంబ్లింగ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
ప్రారంభంలో కళ్యాణ్‌జీ భగత్‌తో కలిసి పనిచేసిన ఖత్రీ, తరువాత తన సొంత మట్కా వ్యాపారాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా విస్తరించాడు. ఖత్రీ ప్రత్యేకత మట్కా గేమ్స్‌తో పాటు ప్లేయింగ్ కార్డులలోని ప్రత్యేక టెక్నిక్స్‌లో ఉండేది. సెల్‌ఫోన్ లేకుండా, దేశం మొత్తం మీద ఆయన నడిపిన గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్ అతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.
సెలబ్రిటీలను కూడా ఆయన బిజినెస్‌లో ఆకర్షించారు. అత్యంత ప్రభావవంతుడైన గ్యాంబ్లర్‌గా అతను చాలా కాలం వెలుగొందాడు. ఖత్రీ పాత్రను ఆధారంగా తీసుకుని, ‘మట్కా’ చిత్రంలో వాసు పాత్రను డిజైన్ చేశారు కరుణ కుమార్. ట్రైలర్‌లో వరుణ్ తేజ్ గెటప్, వాసు పలికిన డైలాగ్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఖత్రీ స్ఫూర్తితో విజయ్ వర్మ ప్రధాన పాత్రలో ‘మట్కా కింగ్’ అనే వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకానుంది.
Post a Comment