టాలీవుడ్లో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో తండేల్ ఒకటి. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం చాలామంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తొలుత క్రిస్మస్ లేదా సంక్రాంతి సీజన్లలో రిలీజ్ అనుకున్నారు. కానీ చివరకు ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టీం నిర్ణయించింది. దీనిపై చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది.
తండేల్ అంటే ఏమిటి? అనే ప్రశ్నకు దర్శకుడు చందూ మొండేటి సమాధానమిస్తూ “తండేల్ అంటే నాయకుడు అని అర్థం” అని చెప్పారు. ఈ పదం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా వినిపించగా, ప్రధానంగా జాలర్లు వాడే పదమని వెల్లడించారు. సినిమా కథకు ఈ పదం అన్వయమవుతుందంటూ దర్శకుడు వెల్లడించారు. పాకిస్తాన్ నేవి ఆఫీసర్లకి చిక్కిన భారత మత్స్యకారులు ఏ విధంగా ఇండియాకు చేరుకున్నారు అనే కథను సినిమాలో చూపించనున్నారు.
ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అని నిర్మాత బన్నీ వాసు ధీమా వ్యక్తం చేశారు. సాయిపల్లవి ఇటీవల అమరణ్ మూవీతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన నేపథ్యంలో తండేల్ కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధిస్తుందన్నారు. “సినిమా చాలా బాగా వచ్చిందని, పెద్ద హిట్ అవుతుందని” బన్నీ వాసు నమ్మకంగా చెప్పారు. అల్లు అరవింద్ కూడా ఈ సినిమాపై మంచి ఆశలు పెట్టుకున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి నటనకు నేషనల్ అవార్డులు కూడా రాగలవని అభిప్రాయపడ్డారు. తండేల్ కథ, దర్శకత్వం, నటనలు—ఈ అన్ని అంశాలు సినిమాకు విజయాన్ని అందిస్తాయని చిత్రబృందం ధీమాతో ఉంది.
Follow
Follow
Post a Comment