అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా ‘పుష్ప 2: ది రూల్’ డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా రన్‌టైమ్ ఇప్పుడు ప్రేక్షకులు, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మొత్తం 3 గంటల 21 నిమిషాల రన్‌టైమ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది తెలుగులో ఇటీవల విడుదలైన పెద్ద చిత్రాలు ‘ఆర్ఆర్ఆర్’ (3 గంటల 6 నిమిషాలు) - ‘అర్జున్ రెడ్డి’ (3 గంటల 1 నిమిషం) లాంటి చిత్రాలను దాటేస్తుంది.
దీనితో ‘పుష్ప 2’ సుదీర్ఘంగా నడిచే చిత్రాల జాబితాలో చేరనుంది. కేవలం సినిమా మాత్రమే కాకుండా, ప్రారంభ ప్రకటనలు, 15 నిమిషాల ఇంటర్వెల్‌తో కలిపి మొత్తం 3 గంటల 45 నిమిషాలపాటు ఈ అనుభవాన్ని ఆస్వాదించాల్సి ఉంటుంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో గతంలో ఇంత రన్‌టైమ్ ఉన్న చిత్రాలు చాలా అరుదు. 1977లో విడుదలైన ఎన్టీఆర్ కల్ట్ క్లాసిక్ ‘దాన వీర శూర కర్ణ’ 3 గంటల 46 నిమిషాలపాటు సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు 46 ఏళ్ల తర్వాత అదే స్థాయిలో ఓ చిత్రాన్ని చూస్తుండటం అనేది గొప్ప అనుభవంగా ప్రేక్షకులు భావిస్తున్నారు. 1963లో వచ్చిన ‘లవకుశ’ (3 గంటల 28 నిమిషాలు) మరియు 1958లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ (3 గంటల 24 నిమిషాలు) చిత్రాలు ఇప్పటికీ చర్చనీయాంశాలు. ‘పుష్ప 2: ది రూల్’ కోసం దర్శకుడు సుకుమార్ ప్రతిష్ఠాత్మకంగా పని చేస్తున్నాడు. ఈ సుదీర్ఘ రన్‌టైమ్ చిత్రంలో ప్రతీ సన్నివేశం కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.
సినిమా మొదటి భాగం సృష్టించిన మాజిక్కు ఇప్పుడు మరింత ఎమోషనల్, యాక్షన్ ఎలిమెంట్లతో ఈ చిత్రాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లనుందని సమాచారం. ఇంటర్వెల్ తర్వాత కథనంలో రాపిడ్ పేస్ తో యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని టాక్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు మరియు ఐటెం సాంగ్ ‘పుష్ప 2’పై మంచి అంచనాలను సృష్టించాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, అడ్వాన్స్ బుకింగ్స్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ప్రేక్షకులు మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాలు కూడా ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి వసూళ్లు సాధించనుందని భావిస్తున్నాయి. ఇక రన్ టైమ్ విషయంలో ఆడియెన్స్ ఎంతవరకు సంతృప్తి చెందుతారో చూడాలి.
Follow
Follow
Post a Comment