మాస్ హీరో గోపిచంద్ ఇటీవల ‘విశ్వం’ సినిమాతో మరో డిజాస్టర్‌ను ఎదుర్కొన్నాడు. ‘లౌక్యం’ తర్వాత ఆయనకి పెద్ద కమర్షియల్ హిట్టు అందలేదు. ‘పక్కా కమర్షియల్’, ‘రామబాణం’, ‘భీమా’, ‘విశ్వం’ వంటి సినిమాలు వరుసగా విఫలమవటంతో గోపి మార్కెట్ పై ప్రభావం పడింది. ప్రస్తుతం గోపిచంద్ పవర్ఫుల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. లైనప్ లో జిల్, రాధేశ్యామ్ ఫేమ్ రాధాకృష్ణతో సినిమా ఉండగా, మరొక న్యూ డైరెక్టర్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అలాగే గోపిచంద్ ఒక తమిళ కమర్షియల్ డైరెక్టర్ తో సినిమాపై ఆసక్తి చూపిస్తున్నాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, అజిత్ తో వరుస హిట్లు అందుకున్న శివ. ప్రస్తుతం ‘కంగువా’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకునేందుకు శివ ప్రయత్నిస్తున్నాడు. గోపీచంద్ కు శివతో మంచి అనుబంధం ఉంది. శివ కెమెరామెన్ గా కెరీర్ ప్రారంభించి, గోపీచంద్ ‘శౌర్యం’ ద్వారా దర్శకుడిగా మారాడు. ఈ ఇద్దరూ కలిసి ‘శంఖం’ సినిమా చేశారు.
తాజాగా కంగువా ప్రమోషన్స్ లో శివ, గోపిచంద్‌తో సినిమా చేయాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. సరైన టైమ్ వచ్చినప్పుడు సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే కంగువా హిట్ అయితే, పాన్ ఇండియా స్థాయిలో అతనిపై ఫోకస్ పెరగొచ్చని టాక్. మరి గోపీచంద్ కోసం శివ తన ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నుంచి బ్రేక్ తీసుకుని, మరొకసారి సినిమా చేస్తాడా అనేది ఆసక్తికర ప్రశ్నగా మారింది.
Follow
Follow
Post a Comment