చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. నిర్మాత రవిశంకర్‌ను ఉద్దేశించి ‘‘ప్రేమ కన్నా కంప్లయింట్స్ ఎక్కువ’’ అంటూ దేవి చెప్పడం, క్రెడిట్స్, రెమ్యునరేషన్ విషయాలను బన్నీకి కోట్ చేయడం వివాదానికి కేంద్రబిందువయ్యాయి.
ఈ వ్యాఖ్యలు పలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాజాగా జరిగిన రాబిన్ హుడ్ ప్రెస్ మీట్‌లో మైత్రి మేకర్స్ అధినేత రవిశంకర్ దీనిపై స్పందించి వివాదానికి తెరదించారు. ‘‘దేవిశ్రీ ప్రసాద్ మాటల్లో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు. మా మధ్య మంచి ప్రేమ ఉంది. అయితే ఆ మాటలను తప్పుగా భావించి మీడియా కథనాలు రాసింది’’ అని రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. మైత్రి మేకర్స్ దేవితో మున్ముందు కూడా సినిమాలు చేయాలని నిశ్చయించినట్లు తెలిపారు. ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ 17 సినిమాలకు దేవి సంగీతం అందిస్తారని కుండబద్ధలు కొట్టారు. ఇవన్నీ చూస్తుంటే, మైత్రి-దేవి కాంబినేషన్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతుందని స్పష్టమవుతోంది.
Follow
Post a Comment