నంద్యాల వివాదం.. తెలివిగా స్పందించిన బన్నీ!


అల్లు అర్జున్ నంద్యాల వివాదం గురించి సినీ అభిమానుల్లో ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి బన్నీ వెళ్లి విష్ చేయడం మెగా ఫ్యాన్స్‌తో పాటు జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య ఆగ్రహం రేపింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌గా మారింది. అయితే అల్లు అర్జున్ ఈ అంశంపై ఇప్పటివరకు నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఇటీవల బన్నీ ఆహా అన్ స్టాపబుల్ షోకు గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ షోలో నంద్యాల వివాదంపై స్పందిస్తారా అనే చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది. అయితే బన్నీ నేరుగా స్పందించకపోయినా, సమస్యకు సంబంధించి సున్నితంగా, చాకచక్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన అభిప్రాయాలు కొన్ని విషయాల్లో మరొకరికి నచ్చిన విదంగా ఉండకపోవచ్చు. కానీ, అది వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపకూడదు. 

నాకు మా నాన్న గారు చాలా ఇష్టమైన వ్యక్తి, కానీ కొన్ని అంశాల్లో మా అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ఆ విషయానికి మాత్రమే అది పరిమితం అవుతుంది, వ్యక్తులకు కాదు.. అని బన్నీ చెప్పుకొచ్చారు. దీని బట్టి బన్నీ శిల్పారవికి మద్దతు ఇవ్వడం తన వ్యక్తిగత విషయమని, పవన్ కళ్యాణ్ జనసేనకు వ్యతిరేకం కాదని హింట్ అయితే ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు నంద్యాల వివాదానికి సంబంధించి ఆయన అర్థవంతమైన సందేశాన్ని ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు బన్నీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ఇలా మాట్లాడడం ద్వారా బన్నీ మెచ్యూరిటీని చూపించారు" అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

Post a Comment

Previous Post Next Post