ది రాజా సాబ్ స్టోరీ.. ఇది మరో లీక్!


పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ హారర్ సినిమా "ది రాజా సాబ్" ప్రేక్షకులను అలరించడానికి ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన ఫస్ట్ లుక్ లో ఆయన గెటప్ చూసిన అభిమానులు ఆశ్చర్యంతో పాటు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభాస్ కొత్త లుక్, ఆయన పాత్రలో మార్పులతో దర్శకుడు మారుతీ అభిమానులకు ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది.


ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు సంజయ్ దత్ తాత పాత్రలో కనిపించబోతున్నారు. ప్రభాస్ తో సంజయ్ కు కీలక సన్నివేశాలు ఉండగా, రజనీకాంత్ చంద్రముఖి తరహా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా తెల్ల జుట్టుతో కనిపించే ప్రభాస్ పాత్రే అసలైన రాజా సాబ్ అని, మరో యంగ్ లుక్ లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసి సెకండాఫ్ లో సర్ప్రైజ్ ఇస్తాడని సమాచారం.

ఓ వైపు భయాన్ని చూపిస్తూనే మరోవైపు రొమాంటిక్ యాంగిల్ కామెడీ ఎలిమెంట్స్ ను కూడా సినిమాలో హైలెట్ చేయనున్నారట. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రొడక్షన్ హౌస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హారర్ కథనం, అద్భుతమైన విఎఫ్ఎక్స్ క్వాలిటీని హైలైట్ చేస్తూ, మారుతీకి ఈ సినిమా చాలా కీలకమని సినీ వర్గాలు అంటున్నాయి.

Post a Comment

Previous Post Next Post