పుష్ప 2 హిందీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రావచ్చు?


అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' చిత్రం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా పట్ల ఉన్న అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. డిస్ట్రిబ్యూటర్స్ అన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రం హక్కులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు, ప్రీరిలీజ్ బిజినెస్ 1000 కోట్ల మార్క్ ను దాటినట్లు టాక్ వస్తోంది. దీంతో మొదటి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తుందని ఎవరికివారు అంచనాలు వేసుకుంటున్నారు.


ఇండియాలో ప్రస్తుతం మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ 'ఆర్ఆర్ఆర్' పేరిట ఉంది, దీని ఫస్ట్ డే కలెక్షన్ 223 కోట్లు. ‘పుష్ప 2’ ఈ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదో చూడాలి. ఇక హిందీలో ఫస్ట్ డే షారుఖ్ ఖాన్ 'జవాన్' మూవీ 65.5 కోట్లు సాధించింది. 'పుష్ప 2' ఈ రికార్డును అధిగమిస్తుందా లేదా అనేది అసలు పాయింట్. పక్కా నార్త్ లో 50 కోట్లు దాటే అవకాశం ఉంది.

పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజు హిందీలో 75 కోట్ల మార్క్ టచ్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో పుష్ప 2 పై మరింత ఆసక్తి పెరిగింది. టీజర్, ప్రోమో కంటెంట్ పై రానున్న స్పందన సినిమా మొదటి రోజు వసూళ్లను నిర్ధారించనుంది.

Post a Comment

Previous Post Next Post