ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగిన ప్రశాంత్ నీల్ ఇప్పటిదాకా చేసిన నాలుగు సినిమాలు మాత్రమే అయినప్పటికీ, అందులో బ్లాక్ థీమ్ ఎక్కువగా కనిపించింది. కేజీఎఫ్ సిరీస్ మొదటి భాగంలో కొత్తగా అనిపించిన ఈ థీమ్, సలార్ వరకు కొంత మోనోటనస్ ఫీలింగ్ కలిగించింది. ప్రతీ సినిమాలో బ్లాక్ బ్యాక్‌డ్రాప్, బొగ్గు పులిమినట్లు ఉన్న విజువల్స్ వంటి అంశాలు ప్రేక్షకులకు అదే రకంగా అనిపించాయి.
అయితే, తన తదుపరి చిత్రంలో వైవిధ్యం చూపించడానికి ప్రశాంత్ సిద్ధమవుతున్నాడని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ తో తీయబోయే కొత్త సినిమాలో బ్యాక్‌డ్రాప్ మార్చి, బ్లాక్ థీమ్‌ను పక్కన పెడుతున్నట్లు యూనిట్ వర్గాలు కంటెంట్ కు తగ్గట్టుగా కలర్‌ఫుల్ గా ఉండే అవకాశం ఉంటుందట. ఈ సినిమా విజువల్స్, కథా నేపథ్యం పూర్తిగా భిన్నంగా ఉంటాయని భావిస్తున్నారు. మొదటి లుక్ పోస్టర్ లో కనిపించిన బ్లాక్ ఎలిమెంట్స్ సినిమాలో ఉండవని సమాచారం.
ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెలాఖర్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్-2 చిత్రంలో బిజీగా ఉండడంతో జనవరి నుంచి ప్రశాంత్ సినిమాకు అందుబాటులోకి రానున్నాడని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కావచ్చని అంచనా.
Follow
Follow
Post a Comment