పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అత్యధిక ఫాలోయింగ్ కలిగిన హీరోల్లో ఒకరు. మల్టీ స్టారర్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతున్న తరుణంలో, ప్రభాస్ మాత్రం ఓ క్రేజీ మల్టీ స్టారర్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ వార్త సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో కలిసి ప్రభాస్‌తో భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించాలని అనుకున్నారు.
సిద్దార్థ్ ఆనంద్ ఇటీవల షారుఖ్ ఖాన్‌తో చేసిన 'పఠాన్' విజయంతో ఆయనపై క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో సిద్దార్థ్, షారుఖ్ మరియు ప్రభాస్ లతో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. కానీ సింగిల్ సిట్టింగ్ లోనే ప్రభాస్ ఈ ఆఫర్ ను తిరస్కరించారని సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం సోలో హీరోగా మాత్రమే సినిమాలు చేయాలనే అభిప్రాయంలో ఉన్నారని తెలుస్తోంది. ఇక డార్లింగ్ మల్టీ స్టారర్ కాన్సెప్ట్ లు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో, సిద్దార్థ్ ఆనంద్ మరో హీరో కోసం చూస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్,’ ‘ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉండగా, ‘స్పిరిట్’ మరియు ‘కల్కి 2’ ప్రాజెక్టుల షూటింగ్స్ 2025 లో స్టార్ట్ చేయనున్నాడు.
Follow
Post a Comment