మహేష్ బాబు-రాజమౌళి.. మొదలయ్యేది ఎప్పుడు?


‘ఆర్ఆర్ఆర్’ విడుదలై రెండు సంవత్సరాలు దాటింది. ‘గుంటూరు కారం’ కూడా విడుదలై పది నెలలు కావస్తోంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ చిత్రంపై అభిమానులు, సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ ఇంకా రాకపోయినా, సినిమా టీమ్ నుండి కొన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి.

లేటెస్ట్ టాక్ ప్రకారం, రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, టీమ్ స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా లొకేషన్స్ రెక్కీ పనులు చేస్తున్నారు, ఈ చిత్రం కోసం 900 నుండి 1000 కోట్ల బడ్జెట్ వెచ్చించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం కాస్టింగ్ మరియు ఇతర ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తరువాత 2025 జనవరి నుండి ప్రారంభించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. 

రాజమౌళి గత చిత్రాల మాదిరిగానే ఈ ప్రాజెక్ట్‌పై ప్రెస్ మీట్ నిర్వహించి, కథ, నటీనటులు మరియు సాంకేతిక వర్గాల వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మహేష్ బాబు అభిమానులకు ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉండొచ్చు. అయితే, డిసెంబర్ 20, 2024 నుండి ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా థియేటర్లలో మహేష్ బాబు వాయిస్ ఓవర్‌ను ఆస్వాదించవచ్చు.

Post a Comment

Previous Post Next Post