మేనల్లుడి కోసం మహేష్ బాబు క్యామియో.. నిజమేనా?


‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ బాబు తెరపై కనిపించరని బాధపడుతున్న అభిమానులకు కొత్తగా మరో న్యూస్ కిక్ ఇస్తోంది. అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న "దేవకీనందన వాసుదేవ" చిత్రంలో మహేష్ బాబు చిన్న క్యామియోలో కనిపించబోతున్నారని టాక్ వస్తోంది. యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, నమ్మదగిన వర్గాల ద్వారా వస్తున్న ఈ సమాచారం ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

దీనికి సంబంధించిన షూట్ రెండు నెలల క్రితం పూర్తి అయినట్టు టాక్. మహేష్, శ్రీకృష్ణుడిగా అతి కొద్ది సేపు మాత్రమే కనిపించనున్నారనీ, డైలాగులు లేకుండా శ్రీకృష్ణుని పాత్రలో దర్శనం ఇస్తారన్నది వినిపిస్తోంది. రాజమౌళి సలహా మేరకు మహేష్ ఈ చిత్రంలో కనిపించేందుకు అంగీకరించారని సమాచారం.

ఇదే నిజమైతే, దేవకీనందన వాసుదేవ మీద ఇప్పటిదాకా లేని క్రేజ్ ఒక్కసారిగా పెరుగుతుంది. ప్రశాంత్ వర్మ రాసిన ఈ కథలో కుటుంబ భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు డివోషనల్ టచ్ ఉండటంతో అశోక్ గల్లా ఈ ప్రాజెక్టు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దీపావళి నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

కంగువ, మట్కాలతో పోటీలో నిలుస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో మహేష్ బాబు లాంటి స్టార్ క్యామియో ఉండటం సినిమాకు అదనపు ఆకర్షణగా మారనుంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ వార్త చిత్రం పట్ల మరింత హైప్ పెంచుతోంది.

Post a Comment

Previous Post Next Post