పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న "హరిహర వీరమల్లు" సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ, పవన్ ఈ ప్రాజెక్టుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. విజయవాడ పరిసరాల్లో వేసిన ప్రత్యేక సెట్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. అక్టోబర్ చివరి కల్లా షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, ఈ చిత్రం పవన్ కి తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో బిజినెస్ గట్టిగానే జరిగే అవకాశం ఉంది. దీపావళి కానుకగా ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాటను పవన్ స్వయంగా పాడినట్లు సమాచారం, ఇది జానపద యాసలో ఉంటుందని చెబుతున్నారు.
అయితే మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్ రాకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ఇంత పెద్ద సినిమాకు కనీస ప్రమోషన్ హడావుడి లేకుంటే ఎలా అని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మేకర్స్ పై వెంటనే అప్డేట్స్ ఇవ్వాలంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకొగా, మిగిలిన భాగం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Post a Comment