అల్లు అర్జున్ - త్రివిక్రమ్.. టార్గెట్ అయితే సెట్టయ్యింది


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప 2: ది రూల్" కోసం దాదాపు తన పార్ట్ పూర్తి చేశాడు, కేవలం ఐటెం సాంగ్ మాత్రమే మిగిలింది. ఇకపై అతని తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. నిర్మాత నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉండబోతుందని హింట్ ఇచ్చినా, ఎప్పుడు మొదలవుతుందన్నది ఇంకా స్పష్టత లేదు. 

ఇటీవల స్క్రిప్ట్ లాక్ అయ్యిందని సమాచారం, ఇదొక కొత్త జానర్‌ లో భారీ బడ్జెట్ తో ఉండబోతుందని టాక్. అయితే, ఈ సినిమా నిర్మాణం ఎంతకాలం కొనసాగుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. పుష్ప 2 కే మూడు సంవత్సరాలు పట్టడంతో మరో ఇంతే టైం తీసుకుంటే అభిమానులు నిరాశ పడతారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

నిజానికి బన్నీ తక్కువ సమయంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలనుకున్నా, ప్రస్తుతం త్రివిక్రమ్ తో ముందుకు సాగడానికి రెడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర దర్శకులతో కమిట్ మెంట్లు ఉన్నా, త్రివిక్రమ్ తో ఈ ప్రాజెక్ట్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉన్నాడు. అట్లీ కాంబో ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది.

ఇక బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను ఏడాది లోపే ఫినిష్ చేయాలని ఒక టార్గెట్ సెట్ చేసుకుంటున్నట్లు సమాచారం. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. మరి త్రివిక్రమ్ అనుకున్నట్లు గా ఏడాదిలో ప్రాజెక్టు సిద్ధమవుతుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post