ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు బాలీవుడ్ నుంచి బడా సెలబ్రెటీలు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకకు మన టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్ వెళ్లడం విశేషం. అలాగే అక్కినేని అఖిల్ కూడా వేడుకలో పాల్గొన్నాడు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్స్ తో కలిసి మహేష్ స్టెప్పులు వేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంతకు ప్రభాస్ ను ఈ వేడుకకు పిలిచారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.
అయినా అఖిల్ లాంటి హీరోలను పిలిచినప్పుడు ప్రభాస్ ను పీలవకుండా ఉంటారా. టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోలకు అయితే ఇన్విటేషన్స్ వచ్చాయి. మెగా ఘట్టమనేని అక్కినేని కుటుంబం నుంచి ఒక్కొక్కరు వెళ్లారు. ఇక ప్రభాస్ కు కూడా ఇన్విటేషన్ రాగా డార్లింగ్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదట. సాధారణంగా ప్రభాస్ చాలా ప్రైవసీ హీరో అని అందరికి తెలిసిన విషయమే. తన ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనే సరిగా ఉండడు. ఇక అంబానీ లాంటి బిగ్ బిజినెస్ మెన్ పిలిచినా కూడా వెళ్ళలేదని తెలుస్తోంది. అయినా ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు. మొన్నటివరకు కల్కి హడావుడి కూడా ఉండడం వలన గ్యాప్ దొరికితే ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాడు. అందుకే ఎలాంటి వేడుకల్లో పాల్గొనడం లేదని తెలుస్తోంది.
Follow
Post a Comment