టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కి సినిమాల పరంగా గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ లేవు. మొదట 13B - ఇష్క్ - 24 సినిమాలతో అతని మేకింగ్ విధానంకు జనాలు ఫ్యాన్స్ అయిపోయారు. అయితే ఇటీవల కాలంలో నాని గ్యాంగ్ లీడర్, థాంక్యూ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయితే నాగ చైతన్యతో దూత అనే వెబ్ సిరీస్ చేశాడు. అది కూడా అంతగా క్లిక్ కాలేదు. ఇప్పుడు దూత వెబ్ సిరీస్ కి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
మరో వైపు సినిమాల పరంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే పనిలో విక్రమ్ కె కుమార్ ఉన్నారంట. ఆ మధ్య అల్లు అర్జున్, వెంకటేష్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు కొన్ని కథలు చెప్పాడు. కానీ ఎందుకో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. నాని తో కూడా ఇంకో సినిమా చేయాలని అనుకున్నప్పటికి అది కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు ఎక్కడా ఛాన్స్ రాకపోవడంతో ఒక హీరో అతనికి పిలిపించి మరి ఛాన్స్ ఇస్తున్నాడు. అతను మరెవరో కాదు, నితిన్. వరుస డిజాస్టర్స్ మీద ఉన్న నితిన్ కి విక్రమ్ కె కుమార్ ఇష్క్ మూవీతో అప్పట్లో సక్సెస్ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే విక్రమ్ కె కుమార్ చాలా ఏళ్ళ తర్వాత మరల నితిన్ తో జత కట్టబోతున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటరెస్టింగ్ స్టోరీ లైన్ విక్రమ్ కె కుమార్ నితిన్ కి నేరేట్ చేసాడంట. ఈ కథ నచ్చడంతో నితిన్ కూడా వెంటనే ఒకే చెప్పేసాడని తెలుస్తోంది. తనకి ఇష్క్ తో సూపర్ హిట్ ఇచ్చి కెరియర్ నిలబడటానికి విక్రమ్ కె కుమార్ కారణం అయ్యారు. ఆ కృతజ్ఞతతోనే మళ్ళీ విక్రమ్ తో టై అప్ అయ్యారు.
ఈ చిత్రాన్ని హనుమాన్ చిత్రంతో సక్సెస్ అందుకున్న నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించనున్నారని తెలుస్తోంది. త్వరలో మూవీకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటనేది రివీల్ కాలేదు. విక్రమ్ కె కుమార్ అంటే యూనిక్ లైన్స్ తోనే ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తారనే టాక్ అయితే ఉంది. నితిన్ ప్రస్తుతం వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తమ్ముడు మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే వెంకి కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీ షూటింగ్ జరుగుతోంది.
Follow
Post a Comment