సూర్య కంగువా.. తెలుగులో ఈ రేటు సరిపోదట

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పాన్ వరల్డ్ మూవీ "కంగువ" తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సూర్య, తన నటనలో వైవిధ్యం చూపిస్తూ విలక్షణమైన పాత్రలను పోషించడం లో పేరు తెచ్చుకున్నాడు. "జై భీమ్", "ఆకాశం నీ హద్దురా" వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సూర్య, ఇప్పుడు "కంగువ"తోనూ అదే స్థాయిలో అందరిని మెప్పించాలని భావిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది


"కంగువ" పోస్టర్లు, టీజర్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయి. సూర్య విభిన్న గెటప్ లో, ఆటవిక వీరుడిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్టు సమాచారం. ఈ కొత్త కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది.

తెలుగు డిస్ట్రిబ్యూటర్లు "కంగువ" రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం, 20 కోట్లకు ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా తెలుగు రైట్స్ కొనేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇంకా ఎక్కువ రేటు వస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా నిర్మాణంలో మన UV క్రియేషన్స్ కూడా ఒక భాగస్వామి. థియేట్రికల్ రైట్స్ మంచి డీల్ సెట్టయితే అమ్మేస్తారు. లేదంటే సొంతంగా రిలీజ్ చేసే అవకాశం కూడా వారికి ఉంది. సూర్య పాపులారిటీ, మరియు సినిమా కాన్సెప్ట్ ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు ఆశించవచ్చు.

కంగువ సినిమా హై వోల్టేజ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న క్రమంలో థియేట్రికల్ రైట్స్ కి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. విడుదల సమయం దగ్గరపడే కొద్దీ ఈ సినిమా రైట్స్ రేటు ఎంతకు నిర్ణయించబడుతుందో చూడాలి. "కంగువ" సూర్యకి మరో పెద్ద హిట్ అందిస్తుందో లేదో తెలియాలంటే అక్టోబర్ 10 వరకు ఎదురుచూడాల్సిందే.

Post a Comment

Previous Post Next Post