రాజమౌళి - మహేష్.. ఇంకా ఎందుకు ఆగినట్లు!



సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమాను అనౌన్స్ చేసి ఇప్పటికే  రెండేళ్ళు దాటిపోయింది. సినిమాను  ఇంకా ఎప్పుడు మొదలుపెడతారు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.  దాదాపు స్క్రిప్ట్ పనులు ఫినిష్ అయ్యాయి అని చాలా రోజులుగా  ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా లో  ప్రధాన విలన్ పాత్ర కోసం  ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ ను ఫైనల్ చేశారు అన్నట్లుగా మరొక టాక్ వైరల్ అవుతుంది. 


అయితే  రాజమౌళి  ఈ సినిమా అప్డేట్ విషయంలో ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి గతంలో  అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఏ సినిమాకు ఈ స్థాయిలో అయితే టైం తీసుకోలేదు. అనౌన్స్ చేసిన కొంతకాలానికి  వెంటనే ప్రాజెక్టును స్టార్ట్ చేస్తూ వచ్చారు. కానీ మహేష్ బాబు ప్రాజెక్టు కి మాత్రం ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు అంతా ఇంతా కాదు.

ఎందుకంటే సినిమా బడ్జెట్  దాదాపు 1000 కోట్లు అయ్యే అవకాశం ఉన్నట్లుగా  టాక్ అయితే వస్తుంది. అందుకే ప్రతి చిన్న విషయంలో కూడా ఎలాంటి పొరపాటు లేకుండా బౌండెట్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్క్రిప్ట్ సిద్దమైన తర్వాత  వర్క్ షాప్ లో పాల్గొనడం ఆ తర్వాత కొన్ని  సన్నివేశాలను టెస్ట్ షూట్ చేయడం వంటి పనులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా  చాలా ప్రైవసీ గా ఎక్కడ లీక్ కాకుండా రాజమౌళి  కొనసాగిస్తున్నట్లు సమాచారం. 

ఇక దాదాపు మహేష్ బాబు ఫైనల్ లుక్ సిద్ధమయింది ప్రధాన విలన్ ని అలాగే మరొక కీలకపాత్రను  ఫైనల్ చేసే ఆలోచనలు అయితే ఉన్నారు. రీసెంట్ గా పృథ్వీరాజ్ ను  రాజమౌళి అయితే సంప్రదించారు. అయితే అది మహేష్ సినిమా కోసమేనా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇక మహేష్  ప్రాజెక్టును ఇప్పుడు మొదలు పెడతారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వడానికి మరొక నెల సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లు టాక్.

Post a Comment

Previous Post Next Post