సీతారామం సినిమాతో దర్శకుడు హను రాఘవపూడి ఒక్కసారిగా ప్రభాస్ దృష్టిని ఆకర్షించాడు. ప్రభాస్ కు ఫ్యామిలీతో కలిసి చూసే లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. ఇక సీతారామం సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే విధంగా ఒక మంచి లవ్ స్టోరీని అతను తీర్చిన విధానం క్లిక్కయ్యింది. అందుకే ప్రభాస్ అతనిని వెంటనే పిలిపించి మంచి కథ ఉంటే చెప్పమన్నాడు. ఇక ప్రభాస్ కు చెప్పిన చిన్న లైన్ చిటికెలో ఫిక్స్ అయిపోయింది.
ఇక మైత్రి మూవీ మేకర్స్ ను పిలిపించి పూర్తిస్థాయిలో బౌండెడ్ స్క్రిప్టు సిద్ధం చేయమని ప్రభాస్ స్వయంగా అడ్వాన్స్ కూడా ఇప్పించాడు ఇక దర్శకుడు హను రాఘవపూడి మొత్తానికి ఫైనల్ స్క్రిప్ట్ అయితే సిద్ధం చేశాడు. అయితే ఈ సినిమాకు అతని కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో పారితోషకం అందుకోబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ హీరోలకు తప్పితే డైరెక్టర్ లకు లాభాల్లో వాటా అనకుండా ఒక పేమెంట్ ఫిక్స్ చేస్తుంది. ఇక హను కి కూడా కూడా భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దాదాపు అతను 20 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ముందుగా 5 కోట్లు అడ్వాన్స్ తీసికున్న హను షూటింగ్ స్టార్ట్ అయ్యాక మిగతా అమౌంట్ అందుకోబోతున్నట్లు టాక్. సీతారామం సినిమాకు 5 కోట్ల కంటే తక్కువ తీసుకున్న హను ఈసారి ఊహించని స్థాయిలో పారితోషకం అందుకోవడం విశేషం. ఇక ప్రభాస్ తో చేయబోయే సినిమా వార్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ గా ఉండబోతున్నట్లు టాక్. ప్రభాస్ ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం కాస్త సన్నబడునున్నట్లు సమాచారం.
Follow
Post a Comment