అకిరా నందన్ ఎంట్రీ.. ఇక వారి చేతుల్లోనే..

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరోగా పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 20 ఏళ్ళ వయసులోకి అడుగుపెట్టిన అకిరా, తన లుక్ తో ఇప్పటికే అభిమానులను ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి జరిగిన కార్యక్రమాల్లో అకిరా కనిపించడం, సోషల్ మీడియాలో అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.


రేణు దేశాయ్ గతంలో అకిరాకు నటనపై ఆసక్తి ఉంటే అతని ఇష్టం అని అన్నారు, కానీ మ్యూజిక్ పైనే అతనికి ఎక్కువ మక్కువ ఉందని చెప్పారు. అకిరా తన మ్యూజిక్ టాలెంట్‌ను మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లో ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పరిణామాలు అభిమానుల్లో కొంత ఆశ్చర్యం కలిగించాయి. ఇప్పటికే అకిరా నందన్ ఫిల్మ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. ఇక అతన్ని హీరోగా లాంచ్ చేయడానికి డివివి దానయ్య, ఏఎం రత్నం వంటి పెద్ద నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని ఒక టాక్ వినిపిస్తోంది. వారు కథలు సిద్ధం చేసి అకిరా ఒకే అనిపిస్తే ముందుగా మెగాస్టార్ చిరంజీవికి నేరేషన్ ఇవ్వాలని చూస్తున్నారు.

పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో అకిరా సినీ కెరీర్ విషయంలో అన్నయ్య మెగాస్టార్ బాద్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ కూడా తమ్ముడి విషయంలో కూడా కేరింగ్ తీసుకోకుండా ఉండలేడు. మెగా ఫ్యామిలీ లో ప్రతీ హీరో మొదటి సినిమాను మొదట మెగాస్టార్ ఓకే చేశారు. ఇప్పుడు అందరూ వారికంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ తో వెళుతున్నారు. ఇక అకిరా విషయంలో కూడా ఆయన నిర్ణయమే ఫైనల్ కానుందని చెప్పవచ్చు.

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో, అభిమానులు అకిరా నందన్ ని జూనియర్ పవర్ స్టార్ గా చూసుకోవాలని ఆశిస్తున్నారు. తండ్రి లెగసీని కొనసాగించాలని భావిస్తున్నారు. అకిరా నందన్ కి తండ్రి సపోర్ట్ ఉండడంతో, ఇండస్ట్రీలో అతని ప్రయాణం ఎలాంటి ఉండబోతుందో చూడాలి. అతని నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Post a Comment

Previous Post Next Post