OG: పవన్ ఈమాత్రం క్రేజ్ పెంచితే చాలు..


డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం పర్యటనలో ఉన్నారు. తనని అత్యధిక మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పేందుకు నియోజకవర్గానికి వచ్చారు. గత మూడు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉంటూ అధికారులు, కార్యకర్తలతో వరుస మీటింగ్ లలో పాల్గొన్నారు. తాజాగా బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమాలపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఆయన ఓ వైపు రాజకీయాలు చేసుకుంటూనే సినిమాలలో కూడా నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 


అయితే ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు మాత్రం పూర్తిచేసే అవకాశం ఉందంట. నిజానికి పవన్ కళ్యాణ్ తాను చేసిన సినిమాలని పెద్దగా ప్రమోట్ చేయరు. గతంలో ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాత్రమే పాల్గొనేవారు. అయితే రాజకీయాలలో బిజీ అయిన తర్వాత అవి కూడా తగ్గిపోయాయి.  ఇంటర్వ్యూలు అయితే అస్సలు ఇవ్వరు. కానీ పవన్ కళ్యాణ్ కటౌట్ కనిపిస్తే ఆటోమేటిక్ గా ఆ సినిమాకి బిజినెస్ జరిగిపోతుంది. అలాగే థియేటర్స్ కూడా హౌస్ ఫుల్ అయిపోతాయి.

అయితే తాజా జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ గురించి మాట్లాడారు. సినిమాలు చేసేంత సమయం లేదని, ప్రజలకి సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్మాతలని రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు.  వీలునుబట్టి 2,3 రోజులు షూటింగ్ లో పాల్గొంటానని వారికి చెప్పడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. మనం ఓజీ అంటే ప్రజలు క్యాజీ అని ప్రశ్నిస్తారని, రోడ్లు బాగుచేయకుండా, డెవలప్ చేయకుండా సినిమాలంటావేంటి అని అడుగుతారని సరదాగా అన్నారు.

అదే సమయంలో ఓజీ సినిమా చూడండి బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. సినిమాకి పవన్ కళ్యాణ్ అదనంగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదని, ఈ తరహాలో మాట్లాడిన ఆటోమేటిక్ గా మూవీపై హైప్ క్రియేట్ అయిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ బాగుందని చెప్పడంతో ఓజీ మూవీపైన ఒక్కసారిగా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

ఈ మూవీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఓజీ మూవీ రిలీజ్ కానుంది. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ పవన్ కళ్యాణ్ ని తుఫాన్ తో పోల్చారు. దీంతో ఆయన పేరు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఓజీ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రేజ్ కచ్చితంగా సినిమాకి హెల్ప్ అవుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ట్రెండ్ క్రియేట్ చేశాయి. మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలకి డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని ఆయన మాటల బట్టి తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post