సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు. మొదటి సారిగా, మహేష్ తన కొత్త లుక్‌తో ఇంటర్నెట్ ను కుదిపేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులోనే తన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన మహేష్, బాలీవుడ్‌లో అడుగుపెట్టి, తన ప్రభావాన్ని చూపించే సమయం వచ్చిందని అనిపిస్తోంది. మహేష్ బాబు కెరీర్‌లో 'స్పైడర్' వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ అవ్వడం వంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, ఆయన తన మార్కెట్‌ను నిలుపుకుంటూ, వరుస హిట్స్ కొడుతూ ముందుకు సాగారు.
గుంటూరు కారం' వంటి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని, కమర్షియల్‌గా విజయవంతమవుతూ, మహేష్ స్టామినాను చూపిస్తున్నాయి. తాజాగా, మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ముంబైలో జరిగిన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆయన ప్రత్యేకంగా ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో, లాంగ్ హెయిర్, లైట్‌గా ఉన్న మీసంకట్టు, గెడ్డం లుక్‌లో కనిపించడం అందర్నీ ఆకట్టుకుంది. మహేష్ బాబు లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'SSMB29' సినిమా కోసం మహేష్ బాబు ఇలాంటి లుక్‌లో కనిపించనున్నాడు. ఈ కొత్త లుక్ బాలీవుడ్ మీడియాను కట్టిపడేసింది. మహేష్ బాబు అందం, స్టైల్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. ఇండస్ట్రీలో మహేష్ బాబు పేరుకు తగ్గట్టుగా, ఆయనకున్న హ్యాండ్‌సమ్ హీరో ఇమేజ్‌కు బాలీవుడ్‌లో కూడా మంచి ఆదరణ లభించబోతోంది. నేషనల్ లెవెల్ కమర్షియల్ యాడ్స్ ద్వారా ఇప్పటికే ఆయన దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఈ కొత్త లుక్‌తో మరింత మంది అభిమానులను సంపాదించుకోనున్నారు. ఒక విధంగా రాజమౌళి సినిమాకు ఇది మరో బోనస్ అని చెప్పవచ్చు.
Follow
Post a Comment