1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఇండియన్ 2, నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి వచ్చిన మిశ్రమ రివ్యూలు, ప్రేక్షకుల అంచనాలకు తక్కువగా ఉండటంతో ఫాన్స్ కొంత నిరాశ చెందారు. అయితే, శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇండియన్ 3 ప్రాజెక్టును కూడా సిద్ధం చేశారు. శంకర్ ఈ సీక్వెల్ సినిమాలను 2017లో ప్రకటించినప్పటికీ, మధ్యలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. 2022లో మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యింది.
ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, ఒక్కో పార్ట్‌కు 250 కోట్ల ఖర్చు పెట్టారు. కమల్ హాసన్, ఈ రెండు భాగాలకూ కలిపి 150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో పార్ట్‌కు 75 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇండియన్ 2 చిత్రం, మునుపటి బ్లాక్‌బస్టర్ హిట్ 'విక్రమ్'కు వచ్చిన టాక్ ను అయితే తలపించడం లేదు. దీంతో నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం కమల్ హాసన్ కెరీర్‌లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ పొందిన ప్రాజెక్టుగా నిలిచింది. ఇక విక్రమ్ సినిమాకి 50 కోట్లు, మరియు కల్కి మూవీలో నెగిటివ్ రోల్ కోసం 20 కోట్లు తీసుకున్నారు.
ఇండియన్ 2 ఫలితం తేడా కొట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ పొన్నియన్ సెల్వన్ సిరీస్‌తో పాటు, లాల్ సలామ్ సినిమాలతో నష్టాలను ఎదుర్కొంది. ఇప్పుడు ఇండియన్ 2 కూడా ఫలితాల్లో తేడా కొడితే, మరింత డ్యామేజ్ జరగడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కమల్ హాసన్ చేతిలో ప్రస్తుతం కల్కి 2898 ఏడీ, థగ్ లైఫ్ సినిమాలు ఉన్నాయి. మణిరత్నం దర్శకత్వంలో సుమారు మూడు దశాబ్దాల తర్వాత కమల్ హాసన్ 'థగ్ లైఫ్' సినిమాలో నటించనున్నారు.
Follow
Post a Comment