డబుల్ ఇస్మార్ట్ డబ్బుల సమస్య.. అంత ఈజీ కాదు!


టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌ పై ఛార్మి కౌర్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలోని పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ కూడా విడుదలయ్యాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కావ్య థాపర్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజ‌య్‌ ద‌త్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.


ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. మేకర్స్ ప్రకటించిన ప్రకారం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కాగా, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ రూ.63 కోట్లు డిమాండ్ చేస్తున్నారని టాక్ వస్తోంది. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ చిత్రం భారీ అంచనాలతో విడుదలై నిరాశపరిచింది. ఈ మూవీతో వచ్చిన నష్టాలు ఇంకా పరిష్కారం కాలేదు.

లైగర్ మూవీకి సంబంధించిన వివాదాలు ఇప్పటికీ కొనసాగుతుండగా, డబుల్ ఇస్మార్ట్ విడుదలకు ముందు ఆ వివాదాలు మళ్లీ బయటకు వస్తాయేమోనని బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి థియేట్రికల్ డీల్స్ మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంకా సినిమా డీల్స్ క్లోజ్ కాలేదని తెలుస్తోంది. అప్డేట్స్ తో కూడా సరైన బజ్ అయితే క్రియేట్ కాలేదు. ఇక బయ్యర్లు లైగర్ భయంతో పాటు సినిమాకి సరైన బజ్ లేదనే టెన్షన్ తో రిస్క్ చేయడం లేదు.

డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలకు ముందు పూరి జగన్నాథ్ టీమ్ అన్ని బకాయిలను క్లియర్ చేసుకోవాలని అవసరం ఉందని టాక్ వస్తోంది. ఈ సమస్యలు పరిష్కారమైతేనే సినిమాకు మున్ముందు మంచి ఊపొచ్చే అవకాశం ఉంది. పాజిటివ్ బజ్ పెరగాలంటే వచ్చే అప్డేట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా, పర్ఫెక్ట్‌గా సినిమా విడుదల చేయడం మేకర్స్ ప్రధాన లక్ష్యం. మరి ఈ సినిమా విడుదలకు సంబంధించిన వివాదాలు ఏ విధంగా పరిష్కారం అవుతాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post