రాజమౌళికి శంకర్ కు ఉన్న తేడా ఒక్కటే.. ఆయనే ఉండి ఉంటేనా..

ఇండియాలో పాన్ ఇండియా అనే పదానికి అసలు అర్థం చెప్పిన దర్శకుడు శంకర్. ఇప్పుడున్న స్టార్ దర్శకులు అందరూ కూడా ఆయనకు ఒకప్పుడు అభిమానులే. శంకర్ ప్రతీ జనరేషన్ లో టెక్నాలజీని ఏదో ఒక విధంగా వాడుకుంటూ వచ్చాడు. ఇక అది తనకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది అని రాజమౌళి కూడా పలు సందర్భాల్లో ఒప్పుకున్నాడు. ఇక రాజమౌళి తన రేంజ్ ను అంతకంతకు పెంచుకుంటూ ఉండగా శంకర్ రేంజ్ మాత్రం వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు.


అయితే రాజమౌళికి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎలాగో.. శంకర్ కి  కూడా అలాంటి పెన్ పవర్ గా ఒకరు ఉండేవారు. దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన తండ్రి పాత్ర చాలానే ఉంటుంది. కథ నుంచి మేకింగ్ వరకు తండ్రి సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటాడు. ఇక శంకర్ కు సుజాత రంగరాజన్ అనే రచయిత సపోర్ట్ చాలా బలంగా ఉండేది.

కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఇలా ప్రతీ విషయంలో ఆయన సలహాలు తీసుకున్నాడు శంకర్. కానీ ఎప్పుడైతే సుజాత శంకర్ మరణించారో అప్పటి నుంచి శంకర్ కు సక్సెస్ కూడా దూరమైంది. ఇండియన్ 2 అవుట్ ఫుట్ తో ఆ విషయంలో స్పష్టత వచ్చేసింది. జెంటిల్ మెన్, ఇండియన్, ఓకే ఒక్కడు, అపరిచితుడు, రోబో ఇలా బిగ్ హిట్ గా నిలిచిన ప్రతీ సినిమాకి రైటర్ గా వర్క్ చేశారు సుజాత రంగరాజన్. ఇక ఇప్పుడు శంకర్ ఆ లోటును తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. నెక్స్ట్ గేమ్ ఛేంజర్ రాబోతోంది. ఆ సినిమాకు యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజన్ కథను అందించాడు కాబట్టి కొంత వరకు హోప్స్ ఉన్నాయి. మరి శంకర్ ఆ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post