దిల్ రాజు.. పైడిపల్లితో అంత రిస్క్ ఎందుకో?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు హిందీ చిత్ర పరిశ్రమలో సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు. 'జెర్సీ' మరియు 'హిట్' రీమేక్‌లను నిర్మించినా, ఆ చిత్రాలు అటు బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అయినప్పటికీ, దిల్ రాజు హిందీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించడానికి ప్రయత్నాలు ఆపడం లేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ మరియు ముంబై మధ్య తరచుగా ప్రయాణిస్తున్నారు. వచ్చే ఏడాది రెండు భారీ ప్రాజెక్టులు ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో చర్చలు జరుపుతున్నారు.


వంశీ పైడిపల్లి తన తొలి హిందీ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించే అవకాశాలున్నాయి. ఆ సినిమాపై 130 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టె అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. అసలే షాహిద్ కు ఇటీవల కాలంలో అక్కడ పెద్దగా సక్సెస్ లేదు. వంశీ పైడిపల్లిని నమ్మి అక్కడ అంత బడ్జెట్ పెట్టడం అంటే మాములు రిస్క్ కాదు. వంశీ పైడిపల్లి సినిమాలు కమర్షియల్ గా కొన్నిసార్లు క్లిక్ అయ్యాయి. కానీ అలాంటి దర్శకుల సినిమాలకు టాక్ తేడా కొడితే మామూలు నష్టాలు రావడం లేదు.

కొరటాల శివ, పూరి లాంటి వాళ్ళు అందుకు ఉదాహరణ. మరి దిల్ రాజు ఎందుకంత ప్రయోగం చేస్తున్నారో సినిమా వచ్చే వరకు సస్పెన్సే. ఇక స్క్రిప్ట్ పూర్తయ్యాక బడ్జెత్ విషయంలో కూడా చివరి నిర్ణయం తీసుకుంటారట. తన ముంబై పర్యటనల సమయంలో దిల్ రాజు పలువురు ప్రముఖ బాలీవుడ్ నటులను కూడా కలిశాడు. ప్రస్తుతం ఈ చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దిల్ రాజు నుండి కొన్ని పెద్ద ప్రకటనలు రానున్నాయని సినీ వర్గాలు అంటున్నాయి.

Post a Comment

Previous Post Next Post