నాని కోసం.. మరోసారి బిగ్ బడ్జెట్!

నేచురల్ స్టార్ నాని మరోసారి తన కెరీర్లో మరో బిగ్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో గత ఏడాది చేసిన దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. నటుడిగా కూడా నాని పూర్తిస్థాయిలో తనను తాను కొత్తగా హైలెట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి అతని దర్శకత్వంలోనే మరొక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.


ఈసారి దర్శకుడు మరొ న్యూ మాస్ సినిమాను సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా వీక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగానే  స్టోరీ లైన్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దసరా కంటే అంతకుమించిన బడ్జెట్ తో ఈ సినిమా చేయబోతున్నట్లు టాక్ వస్తోంది. ఈసారి దాదాపు 150 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారట. నానీ దసరా సినిమా 100 కోట్ల మార్కెట్ ను టచ్ చేసి కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. కాబట్టి ఈసారి ఈ కాంబినేషన్ పై  మరింత ఎక్కువ స్థాయిలో బడ్జెట్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చాలా బలంగా ఉంటాయని తెలుస్తోంది. సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాలో ప్రధానం అంశం అని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post