ఏజెంట్ డైరెక్టర్ ఎక్కడ? మరో హీరో సెట్టయ్యాడా?


ఒకప్పటి స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పరిస్థితి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అఖిల్ తో చేసిన "ఏజెంట్" సినిమా అతనికి భారీ డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా నిర్మాతలకు కూడా భారీ నష్టాలు తీసుకొచ్చింది. కనీసం ఓటీటీ లో కూడా ఏడాది అయినా రిలీజ్ కాలేదు. "సైరా నరసింహారెడ్డి" సినిమా ద్వారా మెగాస్టార్ తో గొప్ప విజయం సాధించిన సురేందర్ రెడ్డి, "ఏజెంట్" ఫ్లాప్ తో అప్పటివరకు ఉన్న డిమాండ్ పోగొట్టుకున్నారు.


ఈ ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా రద్దు అయ్యింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కావడంతో ఈ సినిమా సెట్స్ మీదికి రాలేదు. అంతేకాకుండా, పవన్ కోసం రాసుకున్న కథ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదని టాక్. ప్రస్తుతం సురేందర్ రెడ్డి, వెంకటేష్ కోసం కథ సిద్ధం చేస్తున్నారని సమాచారం. అయినా, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇంతకుముందు శ్రీనువైట్ల వంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. ప్రస్తుతం శ్రీనువైట్ల, గోపీచంద్ తో ఒక సినిమా చేస్తున్నారని టాక్. మరి సురేందర్ రెడ్డి తదుపరి ప్రాజెక్ట్ గా ఏమి తీసుకొస్తాడో, అది ఎవరు హీరోగా ఉంటారో చూడాలి. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ గా ఉన్నవారు, ఇప్పుడు తమ స్థాయిని తిరిగి సాధించడానికి పడుతున్న కష్టం ఇండస్ట్రీలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.

Post a Comment

Previous Post Next Post