కల్కి 'నాగ్ అశ్విన్'.. ఫస్ట్ సినిమాకు 20 లక్షల పెట్టేందుకు భయపడ్డారు!


కల్కి సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. డైరెక్టర్ రాజమౌళి తర్వాత టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఆ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చిన దర్శకుడిగా ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే అతని సినిమా కెరీర్ అనేది అంత ఈజీగా ఏమి సాగలేదు. తల్లిదండ్రులు మంచి డాక్టర్లు అయినప్పటికీ కూడా నాగ్ అశ్విన్ తన కెరీర్ కోసం సొంతంగా చాలా హార్డ్ వర్క్ అయితే చేశాడు. ఇండస్ట్రీలో అతనికి మొదట శేఖర్ కమ్ముల కాంపౌండ్ లో సహాయక దర్శకుడిగా అవకాశం లభించింది.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అక్కడే విజయ్ దేవరకొండ కూడా అతనికి పరిచయమయ్యాడు. ఇక మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చేసింది. కానీ సినిమా ఆశించినంత స్థాయిలో అయితే లాభాలు అందించలేదు. కానీ నిర్మాత అశ్విని దత్ మాత్రం సంతృప్తి చెందారు.

ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన కూతురు ప్రియాంక దత్ నాగ్ అశ్విన్ మరింత దగ్గర అయ్యారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత అతను మహానటి సినిమాతో వైజయంతి సంస్థకు ఒక బిగ్ సక్సెస్ అయితే ఇచ్చాడు. ఇక ఇప్పుడు కల్కి సినిమాతో ఏకంగా 600 కోట్ల బడ్జెట్ సినిమా చేసి మరింత ఎక్కువ స్థాయిలో లాభాలు అందిస్తున్నాడు. అయితే అతని మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగ్ సమయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

నిర్మాత అశ్విని దత్ ఇద్దరు కూతుర్లను నమ్మి ఆ సినిమాపై పెట్టుబడి పెట్టారు. పూర్తి బాధ్యతను కూతుర్లు చూసుకున్నారు. వాళ్ళు కేవలం నాగ్ అశ్విన్ ను మాత్రమే నమ్మారు. ఇక ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల విషయంలో 20 లక్షల బడ్జెట్ పెరగడంతో నాగ్ అశ్విన్ చాలా కంగారు కూడా పడ్డాడట. ఆ సమయంలో ఆ బడ్జెట్ వారిపై చాలా ఒత్తిడిని కూడా పెంచిందట. ఏదేమైనా కూడా ఆ పరిస్థితులను దాటి ఇప్పుడు ఏకంగా అతను వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సినిమాగా కల్కి ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం గ్రేట్. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన వైజయంతి సంస్థకు అతను సరైన వారసుడు కూడా అని చెప్పవచ్చు. భవిష్యత్తులో వైజయంతి సంస్థను అతను మరో స్థాయికి తీసుకు వెళ్తాడు.

Post a Comment

Previous Post Next Post