ఇండియన్ 2: రెహమాన్ ఎందుకు మ్యూజిక్ ఇవ్వలేదంటే.. శంకర్ సమాధానం!



తమిళ సినిమా పరిశ్రమలో శంకర్-ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలు ఎప్పుడు హిట్ అవుతాయి. కానీ, ఈ సారి శంకర్ తన "ఇండియన్-2" సినిమాకు రెహమాన్ ను కాకుండా అనిరుధ్ రవిచందర్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో శంకర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.


శంకర్ మాట్లాడుతూ.."2.0" సినిమా సమయంలోనే "ఇండియన్-2" పనులు మొదలయ్యాయి. కమల్ హాసన్ డేట్లు కూడా అందుబాటులో ఉండటంతో వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఏఆర్ రెహమాన్ "2.0" బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లో పూర్తిగా తలమునకలై ఉండటంతో, "ఇండియన్-2" సినిమాకు సంగీతం గురించి చర్చించుకునే అవకాశం కూడా రాలేదు. రెహమాన్ వద్ద ఇప్పటికే ఇతర కమిట్మెంట్లు ఉండటంతో, అనిరుధ్ ను ఎంచుకోవడం జరిగిందని అన్నారు.

అనిరుధ్ ఈ తరానికి సంబంధించిన అత్యుత్తమ సంగీత దర్శకుల్లో ఒకరు. నాకు అతని సంగీతం చాలా ఇష్టం. యువన్ శంకర్ రాజా, సంతోష్ నారాయణన్, హారిస్ జైరాజ్ వంటి ఇతర సంగీత దర్శకుల పనితనం కూడా నాకు బాగా నచ్చుతుంది. రెహమాన్ లేకపోయినా, అనిరుధ్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతం అందించాడని నమ్మకం ఉంది," అని శంకర్ మరో వివరణ ఇచ్చారు. ఇక ఇండియన్-2 ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెహమాన్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కాకపోయినా, ఆడియో లాంచ్ ఈవెంట్ లో అనిరుధ్ సహా అందరూ అతన్ని గౌరవించడం జరిగింది. మరి, శంకర్-అనిరుధ్ కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post