పిఠాపురం నియోజకవర్గం పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారనే వార్తలు దీనికి కారణం. పవన్ అక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పిఠాపురం ప్రజల రుణం తీర్చేందుకు పవన్ చాలా చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి గెలుపుపై ధీమాగా ఉన్నాడు.
ఇప్పుడు పిఠాపురంలో మరో వార్త కూడా హాట్ టాపిక్ అవుతోంది. శర్వానంద్ నటించిన "మనమే" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడు. ఈ ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పిఠాపురంలో ఈ ఈవెంట్ చేయాలని అనుకుంటున్నారట. ఈ ఈవెంట్‌కు అనుమతులు తెచ్చుకునే పనిలో ఉన్నారట. ఇది నిజమా కాదా అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.
Follow
Post a Comment