ఇండియన్-2: శంకర్ పెద్ద షాక్ ఇచ్చేలా ఉన్నాడు


కమల్ హాసన్ నటనలో విశ్వరూపం చూపించి, "విక్రమ్" సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు. "కల్కి 2898 AD"లో గెస్ట్ రోల్‌ చేస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు. "భారతీయుడు 2"తో కూడా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 1996లో విడుదలైన "భారతీయుడు"కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.


అసలు, "ఇండియన్-2" షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. కానీ, అనేక అడ్డంకులు, ప్రమాదాలు ఈ ప్రాజెక్టును ఆపివేశాయి. 2020లో జరిగిన ప్రమాదంలో కొంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం, వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడం వంటి పరిణామాలు చిత్ర యూనిట్‌ను కుదిపేశాయి. చివరకు, షూటింగ్ పూర్తయింది. అయితే, ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ కాలేదని, ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన పాటలు, పోస్టర్లకు మిశ్రమ స్పందన వచ్చిందని అంటున్నారు. ఇంతకాలం తర్వాత సీక్వెల్ కావడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ చిత్రంలో కమల్ హాసన్ సెకండాఫ్‌లో మాత్రమే కనిపిస్తారని, ప్రీ క్లైమాక్స్ సమయంలో పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తారని సమాచారం. మొదటి భాగంలో సిద్ధార్థ్, ఇతర నటులు ప్రధానంగా ఉంటారని, దీంతో కమల్ హాసన్ అభిమానులకు నిరాశ కలిగే అవకాశముందని చెబుతున్నారు. అంతే కాకుండా, ఇప్పటి వరకు షూట్ చేసిన చాలా పార్ట్ "భారతీయుడు 3"లో ఉంటుందని టాక్. మొదటి భాగంలో కమల్ లేకపోవడం సినిమా టాక్‌కి దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ సినిమా తక్కువ బజ్‌తోనే ఉంటే, కమల్ హాసన్ సెకండాఫ్‌లో మాత్రమే కనిపించడం వల్ల సినిమాపై ఏమేర ప్రభావం పడుతుందో చూడాలి. మొత్తానికి "ఇండియన్-2" సినిమా ఫలితం ఏం అవుతుందో అన్నది ఇప్పటివరకు సస్పెన్స్‌గానే ఉంది.

Post a Comment

Previous Post Next Post