నితిన్, నాగచైతన్య.. పుష్ప 2తో పెద్ద సమస్యే..



టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో విడుదల తేదీలు లాక్ చేసుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలకు ఇది మరింత కష్టంగా పరిణమిస్తుంది. కొన్నింటికి ఓపెనింగ్స్ దెబ్బ వలన మరికొన్ని టైమింగ్ సమస్యల కారణంగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఈ పరిస్థితి 2024 డిసెంబరు లోనూ పునరావృతం కావచ్చని అనిపిస్తోంది. డిసెంబరు 20న నాగ చైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ చిత్రాలు విడుదల కావాలని ముందుగా ప్రకటించారు. 


రెండు వేర్వేరు జానర్లు కాబట్టి, పోటీ ఎంతైనా ఎదుర్కోవచ్చని భావించారు. కానీ, మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప 2 ది రూల్ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబరు లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇది నిజంగా జరిగితే, గీతా ఆర్ట్స్ తండేల్ చిత్రాన్ని సులభంగా వాయిదా వేస్తుంది. రాబిన్ హుడ్ చిత్రాన్ని మరో తేదీకి మార్చవచ్చు, ఎందుకంటే ఆ చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు.

అలాంటప్పుడు తండేల్, రాబిన్ హుడ్ చిత్రాలు ముందుగానే విడుదల కావాలా లేక వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలా అనేది హాట్ టాపిక్ గా మారుతుంది. పుష్ప అక్టోబర్ లో విడుదల అయితే, ఈ సమస్య తీరవచ్చు. కానీ, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అక్టోబర్ లేదా డిసెంబర్లో విడుదల అయ్యే అవకాశం ఉన్నందున, ఇది కూడా ఒక డేంజర్ బెల్ లాంటి విషయమే. దిల్ రాజు, దర్శకుడు శంకర్ తో కలిసి ఈ సినిమా విడుదల తేదీని నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్ చిత్రాలలో ఒకటి ఏటా చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ ఇంపాక్ట్ మిగతా  సినిమాలపై పక్కా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post