కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను.. అంత ఈజీగా రాలేదు..


పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నారు. పదేళ్ల కష్టాలు, పోరాటాలు, గత ఎన్నికల్లో ఎదురైన రెండు పరాజయాలు ఇవన్నీ జనసేనాని పవన్ కళ్యాణ్ కి తీవ్ర గాయాల్ని మిగిల్చాయి. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా తనమంత్రులు, ఎమ్మెల్యేలతో చేయించిన అవమానాలు, తిట్టించిన బూతులు ఎవరు అంత ఈజీగా మర్చిపోరు. క్యాడర్‌లో స్ఫూర్తి తగ్గిపోవడంతో ఏర్పడిన అనుమానాలు అన్నీ తట్టుకుని పవన్ కళ్యాణ్ తన పార్టీని ముందుకు నడిపించారు.


జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సంతోషకరమైన క్షణం ఎట్టకేలకు వచ్చింది. కొణిదెల పవన్ కళ్యాణ్ మంత్రి పదవిని స్వీకరించడం చూసి జనసేన కార్యకర్తలు, అభిమానులు సంతోషంతో మురిసిపోయారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం వల్లే కూటమి ఏర్పాటయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలుమార్లు చెప్పారు. మోడీ సైతం జై కొట్టారు. అయితే ఈ సందర్భంలో ఓ వర్గం వారు పవన్ కంటే గొప్ప వాళ్ళు అని చెప్పవచ్చు. పవన్ ఓడినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ నిజాయితీగా వెంట నడిచారు. పవన్ కోసం పిచ్చిగా ఉండే ఫ్యాన్స్ ప్రత్యర్ధులు తమ లీడర్ ను ఎంత తిట్టినా తట్టుకున్నారు. అప్పటివరకు అభిమానం ఉన్న కొంతమంది పవన్ ఓటమి చెందగానే.. ఇతను గెలవాడేమో అనుకున్నారు. పవన్ పై అబద్ధాలు సృష్టించిన నేతల మాటలకు ఎట్రాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.

కానీ పవన్ కల్పించిన చొరవ, అందరిని ఒకే తాటిపై నడిపించడం వల్లే కూటమి లో ఇరవై ఒక్క సీట్లకే పరిమితమయ్యినా వంద శాతం స్ట్రయిక్ రేట్ సాధ్యమయ్యిందని ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని ఎన్డిఏ మీటింగ్ కి ఆహ్వానించడం కూడా జనసేన బలాన్ని తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ తనదైన ముద్రను రాష్ట్ర రాజకీయాల్లో వేయడం ఖాయమని, చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యం జనసేనకు మరింత బలం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక గతంలో అసెంబ్లీ గేటు తాకనివ్వమని పవన్ ని ఉద్దేశించి కొందరు చేసిన వ్యాఖ్యలు, నైతికత లేకుండా ఆయన వ్యక్తిగత జీవితంపై చేసిన విమర్శలు ఇప్పుడు అన్నీ కొట్టుకుపోయాయి. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్నయ్య చిరంజీవి కాళ్లకు నమస్కారం చేయడం అభిమానులను కదిలించింది. పవన్ కళ్యాణ్ ఒక హీరో, పవర్ స్టార్ గా ఉన్నప్పుడు కనిపించిన ఆ భిన్నత ఇప్పుడు ప్రజా ప్రతినిధి, మంత్రి అయినప్పుడూ కొనసాగుతుంది. ఇకపై పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, రాష్ట్రాభివృద్ధిలో తనదైన శైలి, శక్తిని ఉపయోగించడానికి సిద్ధమవుతున్నారు. ఏ కష్టాలైనా ఎదుర్కొనే సాహసం, పట్టుదల ఉన్న పవన్ కళ్యాణ్ సరికొత్త సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిన సమయం వచ్చింది.

Post a Comment

Previous Post Next Post