జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడితే చూడాలని ఫ్యాన్స్ తో పాటు చాలామంది జనాలు కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన ప్లాన్ వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి పవన్ పొలిటికల్ గా వేసిన అడుగులు అసెంబ్లీ వరకు వెళ్ళేలా చేస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల నుంచి ఎదుర్కొన్న అవమానాలు అన్ని ఇన్ని కావు.
గాజు గ్లాసు మిగిలిపోతుంది అన్నారు కానీ అది పగిలేకొద్దీ పదునెక్కుద్ధి.. అనేది ఇప్పుడు అర్థమైంది. పార్టీ నడపడానికి సినిమాలు చేయడం తప్పితే ఎలాంటి వ్యాపారాలు కూడా పవన్ కు లేవు. గత ఎన్నికల్లోఓకే ఒక్క సీటుతో పవన్ అదే తరహాలో నిలబడిన తీరు అతని పట్టుదలను చూపిస్తోంది. అధికార పార్టీ బలంగా ఉన్నప్పటికీ పవన్ ఏరోజు వెనక్కి తగ్గలేదు. ఓటమి బాధకు సహణంతోనే సమాధానం ఇచ్చాడు. ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాడు.
ప్యాకేజి స్టార్ అని ముద్ర వేశారు. దత్త పుత్రుడు అని హేళన చేశారు. పోలీసులతో జనసేన కార్యకర్తలను కొట్టించారు. నిజానికి పవన్ పర్సనల్ లైఫ్ లో మూడు పెళ్లిళ్లు అనే పాయింట్ తప్పితే అతను జనాలకు సంబంధించిన విషయాల్లో నలుసంత కూడా నష్టం చేయలేదు. అధికార పార్టీ కూడా పెళ్లిళ్లు కాన్సెప్ట్ తప్పితే పవన్ పై పెద్దగా విమర్శలు ఏమి చేయలేదు. ఇక ఎన్ని రోజులు అదే విషయాన్ని చెబుతారు పవన్ పెళ్లిళ్లు కారణంగా పోలవరం ఆగిపోయిందా రాజధాని రావడం లేదా అనే పాయింట్ కూడా జనాలకు అర్థమైంది.
కావాలని పవన్ పై చేసిన వ్యాఖ్యలు నిజం కాదని చాలామందికి అర్థమైంది. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి రామ్ గోపాల్ వర్మ, యాంకర్ శ్యామల, పోసాని వ్యాఖ్యలు వైసిపికి దెబ్బేశాయి తప్పితే పవన్ కు మైనస్ ఏమి కాలేదు. జనసేన ఈ సారి గెలిచుకున్న సీట్లను బట్టి అర్థమైంది. రాబోయే రోజుల్లో ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీ ఇంకా బలంగా మారుతుందని చెప్పవచ్చు.
Follow
Post a Comment