పవన్ కళ్యాణ్.. ఆ కొత్త కథలకు ఓకే చెబుతారా లేదా?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో అఖండ విజయాన్ని సాధించారు. టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్నికల్లో పవన్ గేమ్ చేంజర్ గా నిలిచి, 100% స్ట్రైట్ రేట్ తో గెలిచి రికార్డ్ సృష్టించారు. ఈ విజయం తర్వాత పవన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యతను స్వీకరించారు. ఇప్పటి పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న మూడు సినిమాలు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 


వీటిని వేగంగా ముగించి, పరిపాలనలో పవన్ తన పాత్రను కొనసాగించాల్సి ఉంటుంది. OG - ఉస్తాద్ భగత్ సింగ్ - హరిహర వీరమల్లు మూడు చిత్రాలు కంప్లీట్ అయితే, మరిన్ని సినిమాలు చేయాలా వద్దా అనేది పవన్ నిర్ణయించాల్సి ఉంటుంది. సురేందర్ రెడ్డితో పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో రెండు కథలను రెడీగా ఉంచారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం తప్పనిసరి. అయితే జనసేన అభిమానులు పవన్‌ను పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడిగా చూడాలని ఆశపడుతున్నారు.  పవన్ మంత్రిత్వ శాఖను చేపట్టి, జనసేన సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడితే, 2029 ఎన్నికలలో బలమైన శక్తిగా ఎదగవచ్చు. అలాగే ఓ వర్గం హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం పవన్ అప్పుడప్పుడు ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post