పుష్ప 2 - చెప్పట్లేదు కానీ, పొలిటికల్ భయం పట్టుకుంది!


అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప-2 మళ్లీ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. అనేక నెలలుగా షూటింగ్ జరుగుతున్నా ఇంకా పెండింగ్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ కోసం కూడా చాలా టైమ్ కావాలని . ఇలాంటి కారణాల వల్ల ఆగస్టు 15న విడుదల చేయలేమని మైత్రీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పుష్ప-2 పై ఉన్న భారీ అంచనాలను కాపాడుకోవడానికి, సినిమా మంచి క్వాలిటీతో రావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కామెంట్స్ కూడా వచ్చాయి.


మొదట పుష్ప-2 డిసెంబర్ 20న వస్తుందని అనుకుంటున్నా, అదే రోజు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా విడుదల కానుందని, క్లాష్ రావడం వల్ల మేకర్స్ డిసెంబర్ 6కు మార్చారనే అభిప్రాయాలు వచ్చాయి. క్రిస్మస్ మరియు లాంగ్ వీకెండ్ ను కూడా మిస్ అవుతుంది. ఇక సినిమా పై ఉన్న హైప్, డిసెంబర్ సెంటిమెంట్ ను నమ్ముతూ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే వాయిదా వెనుక మరో బలమైన కారణం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇటీవల ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థిని కలవడం, ఆ తరువాత అల్లు ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ గా కలిసి విష్ చేయకపోవడం వంటి సంఘటనల కారణంగా అల్లు మరియు మెగా ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ ఇంపాక్ట్ బిజినెస్ పై కూడా పడినట్లు గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. నిర్మాతలకు బిజినెస్ విషయంలో క్లారిటీ రావడంతో రిస్క్ చేయకూడదని డిసైడ్ అయినట్లు టాక్.

ఈ పరిస్థితుల్లో పుష్ప-2 ను డిసెంబర్ 6న విడుదల చేయడం మంచిదని మేకర్స్ భావిస్తున్నారని మరిన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసి హడావుడి చేసిన మేకర్స్ సినిమా  డేట్ ను హఠాత్తుగా మార్చడం అంటే అంత సాదరణమైన విషయం కాదు. అలాగే సాంగ్స్ ట్రెండ్ అయినట్లు చెబుతున్నప్పటికీ పుష్ప 1 రేంజ్ లో అయితే వినిపించడం లేదు. ఏది ఏమైనా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోవడం అన్ని విధాలుగా మంచిదే. పొలిటికల్ హీట్ తగ్గాక మెగా అల్లు వారి మధ్య కాస్త సాన్నిహిత్యం కనిపిస్తే సరిపోతుంది. మరి బన్నీ ఏ విధంగా అడుగులు వేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post