సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి ప్లాన్ చేయబోతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న నుంచి రాబోయే సినిమా కావడంతో వరల్డ్ వైడ్ గా SSMB29పై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి గత కొంతకాలంగా రకరకాల రూమర్స్ వినిపించాయి. అయితే వాటిలో వాస్తవాలు లేవని చిత్ర యూనిట్ నుంచి స్పష్టత వచ్చింది. హాలీవుడ్ యాక్టర్స్ ని రాజమౌళి ఈ సినిమా కోసం ఎంపిక చేసారంటూ ప్రచారం నడిచింది.
హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమే అయిన ఇంకా ఆర్టిస్ట్స్ ని ఫైనల్ చేయలేదంట. ఇదిలా ఉంట ఈ చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్న ఎంఎం కీరవాణి ఇంటరెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. SSMB29 మూవీ మ్యూజిక్ వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదని కీరవాణి తెలిపారు. స్టొరీ మొత్తం ఈ వారంలోనే లాక్ అయ్యిందని స్పష్టత ఇచ్చారు. ఇన్ని రోజులు టీమ్ మొత్తం స్క్రిప్ట్ వర్క్ మీదనే దృష్టి పెట్టారని చెప్పారు. స్క్రిప్ట్ ఫైనల్ కావడంతో ఇకపై మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందని కీరవాణి తెలిపారు. త్వరలో టెస్ట్ షూట్స్ జరగబోతున్నాయని కీరవాణి ఈ సందర్భంగా తెలియజేశారు.
కీరవాణి ఇచ్చిన క్లారిటీతో SSMB29 మూవీపై మరింత క్లారిటీ వచ్చింది. ఈ సినిమా స్టొరీబోర్డ్ వర్క్ తో పాటు, ప్రీప్రొడక్షన్, క్యాస్టింగ్ సెలక్షన్ పై రాజమౌళి ఇక ఫోకస్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. త్వరలో చిత్ర యూనిట్ నుంచి దీనిపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్. మరి ఇంది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి. ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో SSMB29 మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Follow
Post a Comment