కల్కి 2898 ఏడి నిర్మాత అశ్వినీ దత్ ట్రెండింగ్ లోకి వచ్చారు. తాను టిడిపి-జనసేన కూటమి విజయంపై ఉన్న నమ్మకాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ కూటమి విజయవంతమవడంతో ఆయన అంచనాలు నిజమయ్యాయి. ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 27న విడుదల కానున్న కల్కి 2898 ఏడి సినిమా టికెట్ రేట్లు, స్పెషల్ షోల విషయంలో ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు.
అశ్వినీ దత్ టిడిపికి పూర్తి మద్దతు ఇచ్చిన అభిమాని కావడంతో సినిమా ప్రమోషన్ కూడా వేగంగా జరుగనుంది. నిజంగా ఆయన డేరింగ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 600 కోట్ల పెట్టుబడి పెట్టిన సినిమాను పాలిటిక్స్ లోకి లాగడం అంటే రిస్క్ తో పని. ఏమాత్రం తేడా వచ్చినా ఆంధ్ర బిజినెస్ చాలా డ్యామేజ్ అయ్యేది. కానీ ఆయన అస్సలు తగ్గలేదు. అదే ఇప్పుడు కల్కి కి బిగ్ ప్రమోషన్స్ గా మారుతోంది.
ఓ వైపు మెగా అభిమానుల సపోర్ట్ మరోవైపు తెలుగు తమ్ముళ్ల మద్దతుతో సినిమా కలెక్షన్లు ఆంధ్రలో కూడా రికార్డు స్థాయిలో ఉండవచ్చు అని తెలుస్తోంది. కల్కి 2898 ఏడి సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ లో ఒక ఈవెంట్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. అది ప్రీ రిలీజ్ ఈవెంటా లేక మరొకటా అనేది త్వరలో ప్రకటిస్తారు. ట్విట్టర్ లో సునీల్ మర్యాద రామన్న క్లిప్ ఎడిట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో జగన్ సైకిల్ మీద పారిపోతూ వెనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అశ్విని దత్ తరుముతూ ఉన్నట్లు ఎడిట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికల హడావిడి అయిపోగానే కల్కి 2898 ఏడి పబ్లిసిటీ పీక్స్ కి తీసుకెళ్లే ప్లాన్ ఉన్నట్లు సమాచారం.
Follow
Post a Comment